రాహుల్‌గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన కమల్
కమల్‌హాసన్ ఈరోజు రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్‌తో వున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలు ఆయన అభిమానులు బాగానే స్పందించారు. కరోనా సమయంలోనే తమిళనాడు ఎలక్షన్లలో కమల్‌హాసన్ రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో ఇక రాజకీయాలకు దూరంగా వుంటున్నట్లు సూచాయిగా వెల్లడించారు.
కానీ, రాహుల్‌తో వున్న ఫొటోను చూశాక ముందు ముందు కమల్ కాంగ్రెస్ వైపు పయనిస్తారేమోనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ తాను పూర్తిచేయాల్సిన సినిమాలు వున్నాయనీ, వాటిపైనే దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఇండియన్2 సినిమా పూర్తిచేయాల్సి వుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కోర్టువరకు వెళ్ళింది.