మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (08:23 IST)

కట్నం కోసం పడక గదిలో నవవధువును చంపిన కసాయి భర్త

దేశంలో కట్న పిశాచుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కట్నం కోసం నవ వధువును కట్టుకున్న భర్త కడతేర్చాడు. అదీ కూడా పడక గదిలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివారలను పరిశీలిస్తే, ఢిల్లీలోని మైదాంగర్హి ప్రాంతానికి చెందిన కుల్దీప్ సింగ్ రాణా(29)కు ఉత్తరాఖండ్ రాస్ట్రంలోని గోలాపర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతితో ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన వివాహమైంది. 
 
రాణా కాంట్రాక్టరు వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. కట్నం కోసం భార్యతో గొడవపడి ఆమెను పడకగదిలోనే చంపాడు. పడకగదిలో భార్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. 
 
నవ వధువు మృతదేహంపై కమిలిన గాయాలున్నాయి. కట్నం కోసమే భార్యను భర్త చంపాడని ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ చెప్పారు. నిందితుడు రాణాను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ చెప్పారు.