శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : శనివారం, 15 మే 2021 (17:39 IST)

గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి అద్భుత ఆఫర్, ఆ పనిచేస్తే డబ్బులు రీఫండ్

అసలే కరోనా కాలం.. ఆపై గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14 కేజీల వంట గ్యాస్ ధర 890 రూపాయలుగా ఉంది. ఇలాంటి తరుణంలో పెటిఎం సంస్థ గుడ్ న్యూస్ అందించింది.
 
గ్యాస్ బుకింగ్ పైన భారీ క్యాష్ బ్యాక్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్లపై 800 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు పేటిఎం సంస్ధ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమేనట. అంతేకాదు మొదటిసారి పెటిఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. 
 
దీని కోసం పేటిఎంలోని రీఛార్జ్ అని క్లిక్ చేసిన తరువాత బుక్ సిలిండర్ అని బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత గ్యాస్ నెంబర్లు, వివరాలను నమోదు చేయాలట. ఇది ముగిశాక ప్రొసీడ్... పే ఆప్షన్ చేయాలట. ఇలా మొదటిసారి పేటిఎం ద్వారా చేస్తే ఆటోమేటిక్‌గా ఈ ఆఫర్ వర్తిస్తుందట.
 
చివరగా గ్యాస్ బుక్ చేసిన తరువాత స్క్రాచ్ కార్డు వస్తుందట. దీన్ని ఓపెన్ చేసిన తరువాత 10 నుంచి 800 రూపాయల వరకు ఉంటుందట. ఈ స్క్రాచ్ కార్డును ఐదు రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం త్వరపడండి.