సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (12:42 IST)

పేటీఎం నుంచి పర్సనల్ లోన్స్.. 2 నిమిషాల వ్యవధిలో రుణాలు

పేటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్. తాజాగా పేటీఎం ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్‌ను వినియోగదారులకు ప్రవేశపెట్టింది. పేటిఎం ఇపుడు రెండు నిమిషాల్లో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇప్పటికే పేటిఎం సేవలను పొందుతున్న వినియోగదారులకు 365 రోజులూ, 24 గంటలూ, 2 నిమిషాల వ్యవధిలో వారి రుణ అర్హతను బట్టీ రుణాలు పొందటానికి పేటిఎం అనుమతిస్తుంది. 
 
అర్హత కలిగిన వినియోగదారులు ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం కింద `పర్సనల్ లోన్‌` టాబ్ ద్వారా ఈ సేవను పొందొచ్చు. మరియు వారి పేటిఎమ్ యాప్ నుండి నేరుగా వారి రుణ ఖాతాను నిర్వహించవచ్చు. లోన్ తీర్చడానికి 18-36 నెలల వాయిదాలలో తీర్చవచ్చు. వాయిదాలను బట్టీ ఇఎమ్ఐ నిర్ణయించబడుతుంది. రుణాలను ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు ప్రాసెస్ చేసి పంపిణీ చేస్తాయి.
 
ఈ చర్య `క్రెడిట్ టు న్యూ` కస్టమర్లను ఆర్థిక మార్కెట్ పరిధిలోకి తీసుకువస్తుంది. సాంప్రదాయ బ్యాంకింగ్ సంస్థలకు యోగ్యత లేని చిన్న నగరాలు, పట్టణాల నుండి వచ్చిన వ్యక్తులకు కూడా ఆర్ధిక సహాయం అందుతుంది.
 
పేటిఎమ్.. రుణ ధరఖాస్తు, పేపర్ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా రుణ పంపిణీ కోసం మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. ఈ కార్యక్రమం అత్యాధునిక పేటిఎమ్ టెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలను 2 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ రుణ సేవను సులభతరం చేయడానికి పేటిఎమ్‌ వివిధ ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.