సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 9 జులై 2020 (18:54 IST)

ద్యావుడా..? కంటెయిన్మెంట్ జోన్‌లో తిరుమల..?

తిరుమల కంటెయిన్మెంట్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే 80 మంది టిటిడి ఉద్యోగస్తులకు కరోనా సోకినట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్త మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం కూడా చేశారు.
 
ఈ నేపథ్యంలో తిరుమలలో పనిచేసే ఉద్యోగుల్లో కొంతమంది బాలాజీనగర్ లోనే నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరిగిపోయాయని.. తిరుమల మొత్తం కంటెయిన్మెంట్ జోన్లో ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో సమాచార శాఖ స్పందించింది.
 
మొదట్లో తిరుమల కంటెయిన్మెంట్ జోన్లో ఉందని చెప్పిన సమాచార శాఖ అధికారులు ఆ తరువాత కేసులు నమోదైన బాలాజీనగర్ మాత్రమే కంటెయిన్మెంట్ జోన్ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. తిరుమల కంటెయిన్మెంట్ జోన్లో ఉందన్న ప్రచారం ప్రసార మాధ్యమాల ద్వారా జరగడంతో భక్తుల్లో ఒకింత భయాందోళన నెలకొంది.