శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (15:15 IST)

భారత్‌లో కరోనా చేయిదాటిపోయిందా.. అమాంతం పెరిగిన కరోనా వృద్ధిరేటు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా అగ్రస్థానంలో ఉంటే, బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అయితే, దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తే వారం పది రోజుల్లోనే కరోనా కేసుల్లో భారత్ అగ్రస్థానంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం దేశంలో కరోనా వృద్ధి రేటు ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకంటే చాలా ఎక్కువగా ఉండటమే కారణంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 
 
అమెరికాలో గత వారం రోజుకు సగటున 1.8 శాతం మేర కేసుల్లో వృద్ధి నమోదు కాగా, రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇది 2.7 శాతంగా ఉంది. నాలుగో స్థానంలో ఉన్న రష్యాలో ఒకశాతం, ఐదో స్థానంలో ఉన్న పెరులో 1.2 శాతం నమోదు కాగా, అత్యధిక కేసుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న మన దేశంలో మాత్రం ఇది 3.5 శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 
 
ప్రస్తుతం దేశంలో సగటున వారానికి 1.14 శాతం మంది కరోనా బారినపడుతుండగా, నెల రోజుల క్రితం ఇది 1.21 శాతంగా ఉంది. అయితే, రెండు వారాల క్రితం 1.12 తగ్గినా మళ్లీ అమాంతం పెరిగింది.