శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (19:25 IST)

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు

కల్కి భగవాన్ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ బృందం అధికారులు మూకుమ్మడిగా బుధవారం దాడులకు పూనుకున్నారు.

చిత్తూరు జిల్లా వరదయ్య పాళ్యం కేంద్రంగా నడుస్తున్న కల్కి ఆశ్రమ పై నాలుగు ఐటీ బృందాలు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తమిళనాడు నేమం కల్కి ఆశ్రమం పై కూడా ఐటీ అధికారుల బృందం బుధవారం ఉదయం దాడులు జరిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కల్కి అనుబంధ సంస్థలు మరో ముప్పై చోట్ల కూడా ఐటీ అధికారులు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం .ప్రధానంగా కల్కి ఆశ్రమ నిర్వాహకులు  ఆధ్యాత్మిక పరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్మును భూముల కొనుగోలు, డిపాజిట్ల వంటివాటిపై దుర్వినియోగం అవుతున్నట్టు తమిళనాడు ఐటీ అధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే తమిళ్ నాడు ఐటీ అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై దాడులకు పూనుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వరదయ్యపాలెం కల్కి ఆశ్రమంపై బుధవారం ఉదయం నాలుగు ఐటీ ప్రత్యేక బృందాలు దాడులకు పాల్పడడంతో కల్కి నిర్వాహకులు అవాక్కయ్యారు.

దీంతో బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్యపాలెం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించిన బినామీ తంతు వంటివాటిపై  కలకలం రేగింది. ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై డేగ కన్నేసింది.

తమిళనాడు ఐటీ అధికారులు రంగప్రవేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తదుపరి ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్లాలో సమాలోచనలో పడింది.