గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:51 IST)

ప్రమాద బాధితుల‌ను రక్షించుకోవడం మన బాధ్యత: కృష్ణా జిల్లా కలెక్టర్ ఏయండి ఇంతియాజ్

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గంటలోపే హాస్పటల్‌కి తీసుకువెళ్ళి వైద్యం అందిస్తే మనిషి బ్రతికే అవకాశాలు ఉంటాయని, ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ హ‌వ‌ర్‌గా ప‌రిగ‌ణించాల‌ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏయండి ఇంతియాజ్ అన్నారు.

32వ జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్సవాల సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రమాదానికి గురైన వ్యక్తికి మొదటి గంటలోపు వైద్యం అందిస్తే, బ్రతికే అవకాశాలు ఉంటాయని, వైద్యం అందించడానికి శరీరం సహకరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురైన వ్యక్తులను ఆస్పత్రిలో చేర్చే విషయంలో గాని, పోలీసులకు సమాచారం అందించే విషయంలో గాని ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి విషయంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు, ప్రమాదానికి గురైన వ్యక్తి ఒకవేళ చనిపోతే ఆసుపత్రుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనన్న భయం చెందాల్సిన అవసరం లేదన్నారు..

 కేంద్ర ప్రభుత్వంలోని చట్టం 134 (ఏ) ప్రకారం, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్ 168 ప్రకారం ప్రమాదానికి గురైన వ్యక్తిని హాస్పటల్లో చేర్చినప్పుడు పోలీసులు మీ నుండి ఎటువంటి ఇబ్బందికర వివరాలు అడగరని, హాస్పటల్లో చేర్పించిన తర్వాత మీరు తిరిగి వెళ్లిపోవచ్చని అన్నారు. వైద్యం నిమిత్తం ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు  చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు.

మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చెప్పనవసరం గాని లేదన్నారు. మీపై  పోలీసు కేసులు నమోదు చేయ‌ర‌ని తెలిపారు. మన ముందు జరిగిన ప్రమాదానికి గురైన వ్యక్తులను రక్షించుకోవడం మన బాధ్యతగా మెలగలన్నారు. ఈ విషయంపై అంద‌రూ ముందడుగు వేద్దామని పేర్కొన్నారు. 

ప్రజల్లో పూర్తి అవగాహన కలిగే విధంగా గుడ్ సమారిటన్ పోస్టర్లను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అతికించే విధంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో డిటిసి యం.పురేంద్ర, ఆర్టీవో కె.రామ్‌ప్రసాద్, వాహన తనిఖీ అధికారులు ఆర్. ప్రవీణ్, నారాయణస్వామి పాల్గొన్నారు.