శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 22 ఫిబ్రవరి 2018 (13:58 IST)

జగన్ ఆస్తుల కేసు... ప్రధాని మోదీకి మారిషస్ నుంచి నోటీసులెందుకు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసు నేపధ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలకు చెందిన ప్రాజెక్టులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటివాటిలో ఒకటైన టెక్ జోన్ ఐటీ సంస్థ కూడా ఒకటి. మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఐటీ సెజ్ కోస

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసు నేపధ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలకు చెందిన ప్రాజెక్టులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటివాటిలో ఒకటైన టెక్ జోన్ ఐటీ సంస్థ కూడా ఒకటి. మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఐటీ సెజ్ కోసం మొత్తం రూ. 115 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు దశలవారీగా పెడుతూ వచ్చింది. ఐతే జగన్ ఆస్తుల కేసులో ఇందూ టెక్ జోన్ కూడా ఇరుక్కుంది. 
 
ఈ కంపెనీలో మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ వాటా 49 శాతం వుంది. సీబీఐ కేసులతో తాము పెట్టిన పెట్టుబడులకు భారీ నష్టం వాటిల్లిందనీ, మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్సులోని ఆర్బిట్రేషన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. తమకు 50 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇప్పించాలని తన పిటీషన్లో కోరింది. ఫిర్యాదు అందుకున్న న్యాయస్థానం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. నోటీసులు అందాయని తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.