98శాతం బిల్లు పెంచేశాడు.. పేదవాడి నడ్డివిరిచిన జగన్: చంద్రబాబు ఫైర్ (video)
ఏపీలో 2024కి 98శాతం కరెంటు బిల్లు రేటు పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీక్కుతిన్నారని.. 2019తో పోల్చుకుంటే 98 శాతం కరెంట్ బిల్లు రేటు పెరిగిందని చంద్రబాబు అన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. తొమ్మిది సార్లు కరెంటు బిల్లును జగన్ పెంచారని గుర్తు చేశారు.
ఒక యూనిట్‌కు ఒక రూపాయి వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి.. గవర్నమెంట్ పే చేయాల్సిన మొత్తం పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అందులో గవర్నమెంట్ సంపాదించుకుంది. 50 యూనిట్లు వాడే వారికి 98 శాతం, 100 యూనిట్లు వాడే వారికి 86శాతం, 200 యూనిట్లు వాడే వారికి 78 శాతం, 300 యూనిట్లు వాడే వారికి 29 శాతం మేర పెంచారు.
ఎప్పుడూ మాట్లాడుతుండే వారు పెత్తం దార్లు పెత్తం దార్లు అంటూ.. ఈ పెత్తందారుడు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. కరెంట్ బిల్లుల పేరిట జగన్ పేదవాడి నడ్డి విరిచిన పరిస్థితి తెచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వారిపై 98 శాతం పెంచాడు. దీంతో పేదవాడిపై 100 శాతం భారం మోపాడని చంద్రబాబు జగన్‌పై ఫైర్ అయ్యారు.