శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మే 2024 (19:12 IST)

నేను లిక్కర్ తాగను.. మద్యం నియంత్రణకు కట్టుబడి వున్నాను.. జగన్

ys jagan
గత ఐదు సంవత్సరాలుగా, సిఎం జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మద్యం నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో సరఫరా అవుతున్న నాసిరకం మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
 
చీప్ లిక్కర్ గురించి ఈ బర్నింగ్ టాపిక్ గురించి ప్రశ్నించగా, జగన్ వ్యక్తిగత అభిప్రాయంతో స్పందించారు. "నేను వ్యక్తిగతంగా మద్యం తాగను. ప్రజలు కూడా మద్యం సేవించాలని నేను నమ్మను. నేను రాష్ట్రంలో నా మద్య నియంత్రణ విధానానికి కట్టుబడి ఉన్నాను. నేను ఏ విధంగానైనా దానిని అమలు చేయాలనుకుంటున్నాను" జగన్ అన్నారు.
 
2019లో జగన్ మద్యంపై నిషేధం విధిస్తానని హామీ ఇచ్చినా చివరకు జగన్ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి మద్యం విక్రయాలను కొనసాగించింది.