1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 మే 2024 (18:59 IST)

సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది: జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి

Jaganmohan Reddy
సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది అంటూ వైఎస్ జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతున్నాడు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోతున్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఘోర పరాజయం చవిచూడబోతున్నాడు. వార్ వన్ సైడ్ జరిగింది. అనంతపురం పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లు మొత్తం మావే. ప్రజలను పేకాటాడేసుకున్న తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వరు.
 
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. బెట్టింగులంటూ ముంచేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 గురించి కాదు, అమరావతి రాజధాని ద్వారా ఆర్జిద్దాము అనే కోణంలో ఆలోచిస్తున్నాడు. జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అనుభవిస్తున్న ప్రజలు ఉదయం 6 గంటలకు బారులు తీరారు.
 
జగన్ గారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభంజనం నడిచింది. మేము 164 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము. జగన్ గారు వైనాట్ 175 అని ఊరికే చెప్పలేదు. ప్రజలంతా తమ పక్షాన వున్న విషయం తెలుసు కనుకనే అలా చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కూడా జూన్ 4న తెలుస్తుంది. అందుకే 4 తేదీ వరకూ మేమే గెలుస్తున్నాము అని కలలు కంటూ వుండండి. చివరికి వచ్చేది, ప్రజలు కోరుకున్న జగనన్న రాజ్యమే అంటూ చెప్పారు.