గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (16:28 IST)

పెట్రోల్ క్యానుతో తిరుపతిలో జనసేనపార్టీ నేత.. ఎందుకు వచ్చాడంటే?

క్రిష్ణాజిల్లా గుడివాడ క్యాసినో వ్యవహారం కాస్త పెద్ద దుమారాన్నే రేపుతోంది. సాక్షాత్తు మంత్రి కొడాలి నానికి చెందిన కళ్యాణ మండపంలోనే క్యాసినో జరిగిందని, పేకాట ఆడుతూ అసభ్యంగా ప్రవర్తించారని టిడిపి చెబుతోంది. నిజ నిర్థారణ కమిటీ నిన్న గుడివాడకు వెళ్ళే సమయంలో పెద్ద దుమారమే రేగింది.

 
టిడిపి నేతలతో పాటు వైసిపి నేతలు పరస్పరం ఆందోళనకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్ళదాడికి దిగారు. ఇది కాస్త రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు కారణమైంది. అసలు తనకు చెందిన కళ్యాణ మండపంలో క్యాసినో ఆడినట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానన్నారు మంత్రి కొడాలి నాని.

 
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానన్నారు. దీంతో తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు ప్రెస్ క్లబ్‌లో ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్‌తో చేరుకున్నారు. ఇదిగో ఆధారాలు అంటూ జగన్, మంత్రి పేరును ఉచ్చరిస్తూ పాటలు పాడుతూ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలను బయటపెట్టారు. 

 
ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకో కొడాలి నాని. ఇదిగో పెట్రోల్. ఆత్మహత్య చేసుకో అన్నారు జనసేన పార్టీ నేతలు. మంత్రి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనంటున్నారు జనసేన పార్టీ నేతలు. క్యాసినో వ్యవహారం కాస్త ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.