శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (20:18 IST)

తిరుపతిలో పావురం కాళ్ళకు సందేశం, ఏముంది అందులో?

తిరుపతి సమీపంలోని ఆటోనగర్‌లో పావురం కలకలం రేపుతోంది. ఒక సందేశాన్ని మోసుకొచ్చింది పావురం. పావురం కాలికి అర్థం కాని భాషలో సందేశం రాసి పంపారు అగంతకులు. గూఢాచారి పావురంగా అనుమానిస్తున్నారు స్థానికులు.

 
ఒక ఇంటి పైకప్పుపై నిలబడి ఉండగా స్థానికులు గుర్తించి దారంతో పావురాన్ని కట్టేశారు. అయితే పావురం కాళ్లకు చుక్కలు పెట్టినట్లుగా ఒక సందేశం కాలికి కట్టబడి ఉంది. దీంతో స్థానికులు ఆ సందేశం ఏమిటో అర్థం కాక పావురాన్ని అలాగే వదిలేశారు.

 
స్థానికంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పావురం కాళ్లకు ఉన్న భాష ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో పోలీసులు పావురం కాళ్ళకు ఉన్న సందేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరలో సంక్రాంతి పండుగ వస్తున్న సమయంలో ఆందోళన కలిగించే ఘటనలు తిరుపతిలో జరుగుతుండటం స్థానికులకు మరింత భయానికి గురిచేస్తోంది.