శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (11:18 IST)

అన్నవరంలో జనసేనాని పర్యటన.. వారాహికి ప్రత్యేక పూజలు

pawan kalyan
జనసేనాని పవన్ కల్యాణ్ అన్నవరంలో పర్యటించనున్నారు. బుధవారం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 
బుధవారం కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్ కావాలని పోలీసులు కోరుతున్నారు. అంతేగాకుండా పవన్ వారాహి యాత్ర.. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌ వివరాలు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జనసేన నేతలు పవన్ పర్యటన విషయంపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ సోమవారం ధర్మయాగం ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో ధర్మ పరిరక్షణ-ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు.