శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (14:14 IST)

పర్యావరణహితంగా దీపావళి జరుపుకుందాం... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. దేశంవ్యాప్తంగా జరిగే దీపావళి పండుగను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ప్రకటన చేశారు. 
 
ఆ ప్రకటనలో "దీప్తం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతి అద్దం పడుతుంది. అటువంటి ఈ దీపాల పండుగ సందర్భంగా యావత్‌ తెలుగుజాతితో పాటు దేశ ప్రజలందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని పర్యవరణ హితంగా జరుపుకోవడం మన అందరి బాధ్యత. పర్యావరణానికి హాని కలిగించని టపాసులతో ఈ దీపావళి వేడుక జరుపుకుంటే ప్రకృతితో పాటు మనందరికీ క్షేమకరం. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అశ్రద్ధ చేయరాదని మనవి. ఈ దీపావళి అందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాంటూ" తెలిపారు.