సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 26 డిశెంబరు 2016 (17:05 IST)

నేను నిఖార్సయిన రెడ్డిని... జగన్ మోహన్ 'రెడ్డి' కాదు... క్రిస్టియన్

తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్

తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి, రెడ్డి కాదనీ... ఆయన క్రిస్టియన్ అని చెప్పారు. 
 
పీసిసి చీఫ్ రఘువీరా రెడ్డి కూడా రెడ్డి కాదని అన్నారు. ఐతే కులాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనవసరమన్నారు. 21 శతాబ్దంలో ఇంకా కులాన్ని పట్టుకుని వేలాడటం వేస్ట్ అని చెప్పుకొచ్చారు. కులం గురించి మాట్లాడితే రాజకీయాల్లో దెబ్బ తింటారనీ, కాబట్టి కులం కార్డుతో రాజకీయాల్లోకి వచ్చేవారు పనికిరాకుండా పోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందనీ, అది తిరిగి బ్రతకడం కల్ల అని అన్నారు.