శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (14:22 IST)

2019 ఎన్నికలే టార్గెట్.. రాజకీయ వారసులు వచ్చేస్తున్నారు.. గుంతకల్లు నుంచి జేసీ పవన్ రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వారసుల చేతికి వచ్చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వారసులను బరిలోకి దించేందుక తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పూ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వారసుల చేతికి వచ్చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వారసులను బరిలోకి దించేందుక తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి బరిలోకి దిగనున్నారు. అదే సమయంలో రాయ‌ల‌సీమ‌లో ధీటైన రాజ‌కీయ కుటుంబంగా పేరున్న జేసీ ఫ్యామిలీ నుంచి వార‌సుడొస్తున్నాడు.

తేదేపా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గుంతకల్లులో పవన్ ఏ కార్యక్రమం చేపట్టినా అమాంతమైన క్రేజ్ రావడంతో.. ఆయనను 2019 ఎన్నికల బరిలో దించేయాలని జేసీ ఉవ్విళ్లూరుతున్నారు. 
 
కొన్నాళ్ల‌క్రిత‌మే ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నిక‌ల సంద‌ర్భంగా తొలిసారిగా జేసీ దివాక‌ర్‌రెడ్డి కుమారుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ప‌తాక శీర్షిక‌ల్లోకి వ‌చ్చారు. చిత్తూరు జిల్లా-గ‌ల్లా అరుణ కుమారి కుమారుడు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌తో పోటీపడి తానేంటో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో నేను సైతం అంటూ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశారు ప‌వ‌న్‌రెడ్డి.

దీంతో గుంత‌క‌ల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద‌ర్ గౌడ్ గుండెల్లో రైళ్లు రిగెడుతున్నాయి. గుంత‌క‌ల్లును పారిశ్రామికీక‌ర‌ణ చేస్తామంటూ జేసీ ప‌వ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. మరోవైపు 2019 ఎన్నికల్లో తన కోడలు బ్రాహ్మణిని పూర్తి స్థాయిలో బరిలోకి దించాలని చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్న సంగతి తెలిసిందే.