శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:43 IST)

ఏపీ హైకోర్టు లో ఉద్యోగాలు

ఏపీ హైకోర్టు నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 55 సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 55 ఉద్యోగ ఖాళీల్లో మహిళలకు 18 ఉద్యోగాలు కేటాయించగా పురుషులకు 37 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
 
http://hc.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 2వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని 800 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
 
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఏపీ హైకోర్టులో మొత్తం 68 సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలలో 13 ఉద్యోగాలను హైకోర్టు బదిలీల ద్వారా భర్తీ చేస్తుంది. పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీ హైకోర్టు వెల్లడించింది.