బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (12:58 IST)

అసలే అక్రమసంబంధం.. గ్యాప్‌లో ఇతరులతో లింక్.. ఎక్కడ?

తమిళనాడులోని కరూర్‌‌లో‌ ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ఓ ప్రియుడు.. ఆమెను దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... కరూర్ జిల్లాకు చెందిన లీలా అనే మహిళకు పదేళ్ల కుమార్తె, ఓ కుమారుడు వున్నాడు. లీలా భర్త మృతి చెందడంతో కుటుంబాన్ని పోషించేందుకు భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసేది. 
 
పనికెళ్లిన చోట లీలాకు నటరాజన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. లీలాకు నటరాజన్‌తో గాకుండా ఇతర వ్యక్తులతో పరిచయం ఉండేది. ఈ పరిచయాలతో లీలాపై నటరాజన్‌కు అనుమానం పెరిగింది. దీనిపై నటరాజన్ లీలాను ఖండించినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఫలితంగా ఆగ్రహావేశానికి గురైన నటరాజన్ లీలాను కత్తితో నరికి హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటరాజన్‌ను అరెస్ట్ చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు.