వలస కూలీలపై దాతృత్వం చాటుకున్న కేశినేని శ్వేత

kesineni swetha
ఎం| Last Updated: శుక్రవారం, 22 మే 2020 (23:02 IST)
విజయవాడ వైపు నుండి సుదూర ప్రాంతాలకు పయనమైన వలసకూలీలకు అల్పాహారం,సానిటరీ కిట్,విటమిన్ ట్యాబ్ లెట్లు, మాస్కులు పంచి దాతృత్వం చాటుకున్నారు టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత.

మాట్లాడుతూ వలస కూలీలలకు ప్రతి రోజు కేశినేని భవన్ మరియు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో సాయం అందిస్తున్నామని, ఈ రోజు శ్వేతాంబర్ జైన్ ట్రస్ట్ మరియు వజ్రా టీం యూత్ వారి సహకారంతో విజయవాడ రామవరప్పాడు జాతీయ రహదారీ కూడలిలో రెండు వందల మంది వలస కూలీలకు అల్పాహారం, విటమిన్ ట్యాబ్ లెట్లు ఇతర వస్తువులు పంపిణి చేశారు.

ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వలస కూలీలకు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. వలస కూలీలకు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. వలసకూలీలకు ఆహారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల సాయం అబినందనీయమని కుమారి కేశినేని శ్వేత అన్నారు.దీనిపై మరింత చదవండి :