శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 16 జూన్ 2020 (20:24 IST)

జూనియర్ ఎన్టీఆర్‌ను కొడాలి నాని అలా రెచ్చగొడుతున్నారా?

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీయే లేకుండా చేయాలని ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక మంత్రులైతే టిడిపి నాయకులను ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రితో పాటు ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది.
 
ఇదంతా జరుగుతుండగానే టిడిపి పార్టీ పగ్గాలు వయస్సు మీరిపోయిన చంద్రబాబుకు అవసరం లేదని, లోకేష్ అధ్యక్ష పదవికి పనికిరాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇదంతా వైసిపి బ్యాచ్ చేస్తోందంటూ టిడిపి నాయకులంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌ను పదే పదే రెచ్చగొడుతున్నారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్టీఆర్ నువ్వు రావాలి. ఆ బాధ్యతలు నువ్వు తీసుకో. తాత పార్టీ పెట్టాడు. ఆ పార్టీని నువ్వు కాపాడుకో. నువ్వే సరైన సారథివి అంటూ పదేపదే జూనియర్ ఎన్టీఆర్ ను రెచ్చగొట్టేస్తున్నాడట. ఈ మధ్య కాలంలో కొడాలినాని ఇదే విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త చర్చకు దారితీస్తోంది.
 
జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానిలు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గతంలో సినిమాలు కూడా చేశారు. నిర్మాతగా కొడాలి నాని వ్యవహరిస్తే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆ స్నేహంతోనే కొడాలి నాని ఇలా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు రాజకీయాల గురించి అస్సలు నోరు మెదపడం లేదు.