గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (18:31 IST)

సీఎం జగన్‌తో కొడాలి నాని భేటీ.. అందుకేనా?

kodali nani
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి సోమ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యానికి మాజీ మంత్రి కొడాలి నాని వచ్చారు. సీఎం జ‌గ‌న్‌తో నాని భేటీ అయ్యారు. 2024 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు స‌మ‌యం ఉన్నా.. ఏపీలో అప్పుడే ఎన్నిక‌ల వేడి రాజుకుంది. 
 
ఎన్నిక‌ల్లో పొత్తుల దిశ‌గా టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల నుంచి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తుండ‌టం కాక రేపుతుంది. దీనిపై వైసీపీ కూడా ఘాటుగానే స్పందిసోంది. సరిగ్గా ఈ సమయంలో జ‌గ‌న్‌తో కొడాలి నాని భేటీ కావడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.  
 
విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో కొడాలి నాని సిద్దహస్తుడు. ఇప్పుడు ఉన్న మంత్రులు అంబటి రాంబాబు, రోజా కూడా అదే స్థాయిలో విరుచుకుపడేవారు. దీంతో కొడాలి.. సీఎం జగన్‌‌ను మీట్ అవడంతో సర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది.