1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (11:44 IST)

సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ: రైతులను ఆదుకోండి

Achennaidu
సీఎం జగన్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఏపీలో ఇటీవ‌ల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయ‌న కోరారు. వ‌ర్షాల‌కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా రాష్ట్ర స‌ర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయార‌ని, వారిని అకాల వర్షాలు మరిన్ని ఇబ్బందుల‌కు గురిచేశాయని అన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. 
 
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు హామీలు ఏమ‌య్యాయ‌ని అచ్చెన్నాయుడు నిల‌దీశారు. 
 
మూడేళ్లలో వ‌ర్షాలకు దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన‌ పంట నష్టం జ‌రిగింద‌ని, అయితే, ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదని ఆయ‌న అన్నారు.