బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (19:58 IST)

నారా లోకేష్‌‌పై రాళ్ల దాడి.. వైసీపీ కుక్కలు రాళ్లు రువ్వారని ఫైర్

nara lokesh
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌‌పై రాళ్ల దాడి జరిగింది. తెనాలిలో హత్యచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలవైపు దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి య‌త్నించిన తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 
 
హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు వ‌చ్చిన త‌న‌పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగడం వైసీపీ దిగజారుడు తననానికి పరాకాష్ట అన్నారు. ఈ త‌ర‌హా దాడుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. త‌మ‌పైకి వైసీపీ కుక్క‌లు రాళ్లు రువ్వాయ‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.