గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (17:47 IST)

దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థిగా సంతోషి రూపవాణి

Duggirala
Duggirala
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి సంతోషి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ కార్యాలయంలో పటిష్ట బందోబస్తు ఉత్కంఠ మధ్య ఎన్నిక కొనసాగింది. 
 
ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో టీడీపీ, జనసేనలకు చెందిన గెలిచిన ఎంపీటీసీలో ఎవరూ బీసీలు లేకపోవడంతో వైసీపీ అభ్యర్థి సంతోషి రూపవాణితో ఎమ్మెల్యే ఆర్కే దగ్గరుండి నామినేషన్‌ను వేయించారు.
 
ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన 9 మంది సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 8 మంది గెలుపొందగా ఒకరు జనసేనకు చెందిన అభ్యర్థి విజయం సాధించారు. గత ఏడాదిన్నర కాలం టీడీపీ కోర్టుకెక్కడంతో ఆగిపోయిన ఈ ఎన్నికలు గురువారం జరిగాయి. 
 
దుగ్గిరాల బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో బీఫామ్‌ ఇచ్చిన ఒకే ఒక్క అభ్యర్థి సంతోషి రూపవాణి నామినేషన్‌ దాఖలు చేసింది. గడువులోగా ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది.