ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (16:28 IST)

ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాస రావు

kommineni srinivasa rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల పందేరానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నియమించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావును నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవిలో ఈయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 
 
కేబినెట్ హోదాలో కొమ్మినేని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎం జగన్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి టీవీలో కొమ్మినేని పనిచేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు మరో పదవిని ఆయనకు కట్టబెట్టింది.
 
కాగా, సినీ నటుుడు అలీని కూడా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా నియమించిన విషయం తెల్సిందే. చిత్ర పరిశ్రమకు చెందిన అలీ, పోసాని కృష్ణమురళిలు సీఎం జగన్‌కు గట్టిగా మద్దతునిస్తున్నారు.