గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

భాగ్యనగరిలో వరుణ ప్రతాపం - జలమయమైన రహదారులు

rain
భాగ్యనగరంపై వరుణ దేవుడు మరోమారు తన ప్రతాపం చూపించాడు. ఫలితంగా నగరం జలమయమైంది. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచి అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడుతూ మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షంగా మారింది. దీంతో అవసరం రీత్యా బయటికి వచ్చిన నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 
ముఖ్యంగా నగరంలోని కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హైదర్‌గూడ, నారాయణగూడ, లక్డీకాపూల్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రామ్‌నగర్‌, దోమలగూడ, బోలక్‌పూర్‌, కవాడిగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్‌ వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 
 
ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అనేక పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించే చర్యల్లో నిమగ్నమయ్యారు.