సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శనివారం, 24 ఆగస్టు 2019 (19:39 IST)

జస్ట్ ఒక్క పాయింటుతో చేజారిపోయింది... చంద్రబాబు నాయుడు ట్వీట్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న నత్తనడక పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా పేర్కొన్నారు. ''నీరు-చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్ళంతా నానారకాలుగా మాట్లాడారు. ఈరోజు ఇదే కార్యక్రమానికి దేశమంతా ప్రశంసలు వస్తున్నాయి. మా పాలనలో సమర్ధ నీటి నిర్వహణ వలన నీతి ఆయోగ్ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును ఇచ్చింది. కేవలం ఒక పాయింటు దూరంలో మొదటి ర్యాంకు పోయింది.
 
విపత్తు నిర్వహణ చేతకాకపోతే ఇంక ప్రభుత్వాలెందుకు? హుద్ హుద్ తుఫాన్ లో 240కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలతో విశాఖ వణికింది, తిత్లి తుఫాన్ లో 180కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలతో శ్రీకాకుళం అల్లాడింది.. ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేశాం.
 
గంటల వ్యవధిలోనే పునరావాస, సహాయ చర్యలతో బాధితులను ఆదుకున్నాం. వేలాదిమందికి ప్రతిరోజూ భోజనాలు, నాణ్యమైన నిత్యావసరాల పంపిణీ చేశాం.. నేలకూలిన లక్షలాది చెట్లను తొలగించాం, విరిగిపడిన వేలాది కరెంట్ స్తంభాలను పునరుద్దరించాం. ఆ స్ఫూర్తి ఇప్పుడీ కృష్ణా, గోదావరి వరదల్లో ఏమైంది?'' అని ప్రశ్నించారు.