1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 13 నవంబరు 2021 (20:17 IST)

ఓటుకు 5 వేల రూపాయలు, కుప్పంలో మామూలుగా లేదుగా?

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రచారానికి వెళుతూ ఓటర్లను బయటకు పిలిచి నగదు పంచేస్తున్నారు పార్టీల కార్యకర్తలు. ఓటుకు 3 వేల నుంచి 5 వేల రూపాయలు పంచుతున్నట్లు టిడిపి నాయకులు వైసిపి పైన ఆరోపిస్తున్నారు. వైసిపి డబ్బులు పంపిణీ చేసే వీడియోలు ఇవిగో అంటూ చూపిస్తున్నారు.

 
మరికొన్ని చోట్ల స్లిప్పులు ఒకచోట.. నగదు మరో చోట ఓటర్లకు ఇస్తున్నారు. వైసిపికి పోటీగా టిడిపి నేతలు కూడా డబ్బులు పంచుతున్నారట. ఆ వీడియోలు బయటకు వచ్చాయి.

 
1500 నుంచి 2,500 రూపాయలు ఒక ఓటుకు పంచుతున్నారట. ప్రచారంలోనే కరపత్రాల మధ్యలో డబ్బులు పంపిణీ చేస్తున్నారట. ప్రతిష్టాత్మకంగా మారిన కుప్పం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి, టిడిపి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.