1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (18:52 IST)

హుజురాబాద్ బాద్‌షా ఈటల రాజేందర్

హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబర్చారు. 20వ రౌండ్‌లో ఈటల రాజేందర్ 21,015 ఓట్ల మెజార్టీ సాధించారు. మరో రెండు రౌండ్లు మిగిలివున్నాయి. ఈ రెండు రౌండ్లు ఈటల రాజేందర్ సొంత మండలానికి సంబంధించినవి కావడంతో మరింత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈటల రాజేందర్ 2004 నుంచి వరుసగా 7సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
ఇక ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు బీజేపీ నేతలు నివాళులర్పించి స్వీట్స్ పంచుకున్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ విజయం సంకేతమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా ఉత్కంఠను రేకెత్తించిన విషయం తెల్సిందే.