జనసేనలోకి కూసంపూడి శ్రీనివాస్
లోక్ సత్తా అదికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకుడు కూసంపూడి శ్రీనివాస్ ఈరోజు జనసేన పార్టీలో చేరారు.. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ, రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో అనుభవం ఉన్న శ్రీనివాస్ సేవలు పార్టీలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
జనసేనాని పవన్‌కల్యాణ్ చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని వారికి అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. అందరికీ వినోదాన్ని అందించే సినిమా ఇండస్ట్రీలో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నేరవేర్చడానికి చిత్రపురి కాలనీని ఏర్పాటు చేశారు.
అయితే అందులో కొన్ని సమస్యలు ఎదుర్యయాయి. ఈ సమస్యలను చిత్రపురి సాధన సమితి సభ్యులు పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా కలిసి విన్నవించారు. సినిమా రంగంతో సంబంధం లేనివారు ఫ్లాట్స్ దక్కించుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ స్పందించారు.
చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని వారికి అండగా నిలుస్తానని పవన్ అన్నారు. ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్.శంకర్‌లతో చర్చిస్తానని అన్నారు.