సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 27 జులై 2019 (18:06 IST)

జనసేన క్యాడెర్‌తో 29 నుంచి పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశాలు...

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ నెల 29వ తేదీ నుంచి పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళగిరి, విజయవాడలలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలుంటాయి. పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్య నేతలతో చర్చిస్తారు. 
 
పార్టీ బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖాముఖీ చర్చలుంటాయి. 29వ తేదీ ఉదయం 11 గంటల నుంచి పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. 
 
30వ తేదీ ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, 31వ తేదీ ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశాలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతాయి.