శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 27 జులై 2019 (16:00 IST)

చెంగాళమ్మ అంతరాలయానికి బంగారు తాపడం

సూళ్లూరుపేట : ఆంధ్ర, తమిళనాడు భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలోని అంతరాలయానికి చెన్నైకి చెందిన నంబూరు మనోజ్‌కుమార్‌ సోదరులు బంగారు తాపడం చేయిస్తున్నారు. పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
గతంలో కొలతలు తీసుకెళ్లి, ప్రస్తుతం కవచాలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. దీంతో అంతరాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.