సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (21:09 IST)

ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ

రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత్ లో ఆస్ట్రేలియా రాయబారి సూశాన్ గ్రేస్ బృందంతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో  ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పరస్పర సహకారంపై చర్చించింది. తమకు ఆసక్తి ఉన్న రంగాలపై ఈ సందర్భంగా ప్రతినిధి బృందం రాష్ట్ర అధికారులకు వివరించింది.
 
 ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలక శాఖ కమిషనర్ విజయకుమార్, సిఆర్ డిఎ కమిషనర్ డా.పి. లక్ష్మీ నరసింహం, విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు, స్పెషల్ కమిషనర్ వి రామమనోహరరావు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సి.చంద్రయ్య, డైరక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ రాముడు తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.