సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (09:16 IST)

కలికిరిలో మళ్లీ చిరుత?

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కలికిరిలో మళ్లీ చిరుత కనిపించింది. కలికిరి నుంచి సీఆర్పీఎఫ్‌కు వెళ్లే దారిలోని బయ్యారెడ్డి చెరువు మొరవ వద్ద చిరుత కనిపించిందని కొండకావలిపల్లెకు చెందిన లక్ష్మయ్య తదితరులు చెప్పారు.

దీంతో బీట్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌ తదితరులు చిరుత జాడ కోసం వెదుకులాట ప్రారంభించారు. సైనిక పాఠశాల మైదానంలో గత శుక్రవారం ఒక మేకను గుర్తుతెలియని జంతువు చంపి పడేసిన విషయం తెలిసిందే. ఆ మేక కొండకావలిపల్లెకు చెందిన కృష్ణయ్యది.

అయితే మేకను చంపినది చిరుత కాకపోవచ్చని అటవీ అధికారులు నాటు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం మళ్లీ నాలుగు రోజుల వ్యవధిలోనే చిరుత కనిపించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో ఎఫ్‌బీవో ప్రతాప్‌, ఏఎఫ్‌బీవో జ్యోతి, గ్రామస్తులతో చిరుత పులి పాదముద్రల కోసం మంగళవారం రాత్రి వెతికారు.