ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (19:19 IST)

పిల్లి.. చిరుత ఫైట్ వీడియో నెట్టింట వైరల్.. (video)

Leopard_Cat
సోషల్ మీడియా పుణ్యమాని ప్రస్తుతం ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా పిల్లి.. చిరుత ఫైట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పిల్లి.. చిరుతను చిక్కుల్లోకి నెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. నాసిక్‌లోని ఓ బావిలో చిరుతపులితో పాటు పిల్లి కూడా చిక్కుకుంది. అయితే ఈ రెండింటి మధ్య చిన్నపాటి పోరాటం కూడా జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో పిల్లిని చూసిన చిరుత పులి దానిపై దాడి చేయబోయింది. ఇంతలో పిల్లి తప్పించుకుని పారిపోయేందుకు సిద్ధమైంది. పిల్లిని వెంబడిస్తూ చిరుత కూడా పరుగు లంఖించుకుంది. ఈ రెండూ ఓ బావిలో పడ్డాయి. 
 
కోపంతో ఉన్న చిరుత పిల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పిల్లి కూడా ధాటిగానే స్పందించింది. అయితే, చిరుత మాత్రం పిల్లిని ఏమీ చేయకుండా వదిలేయడం విశేషం. ఈ రెండింటి మధ్య పోరాటాన్ని నెట్టింట్లో పెట్టడంతో వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఇకపోతే.. బావిలో పడిన చిరుత, పిల్లిని అటవీ శాఖాధికారులు సురక్షితంగా వదిలిపెట్టారు.