1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 4 సెప్టెంబరు 2021 (13:45 IST)

ట్రైన్ కోసం ప్లాట్ ఫాం పై ప‌రుగు తీసిన క‌ర్ణాటక విద్యాశాఖ మంత్రి

ట్రైన్ కోసం ఓ ప్యాసింజ‌న్ ప్లాట్ ఫాం పై ప‌రుగులు పెట్టాడు. ఆయ‌న సాధార‌ణ ప్యాసింజ‌ర్ అయితే ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. ఆయ‌న సాక్షాత్తు క‌ర్నాట‌క రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బి.సి. న‌గేష్.
 
సెక్యూరిటీ లేదు...మందీ మార్బలం లేదు.. కనీసం గన్ మెన్ కూడా లేడు.. ట్రైన్ ఎక్కేందుకు రైల్వే ప్లాట్ ఫామ్ పై పరిగెడుతున్న కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత విద్యా శాఖ మంత్రి బి.సి. న‌గేష్..అత‌నే అంటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. 
 
అదే వేరే మంత్రి అయితే, మందీ మార్బ‌లం... గ‌న్ మెన్ లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు హ‌డావుడి, హంగామా. అవ‌స‌రం అయితే, పెద్ద సారు కోసం ట్రైన్ ని కూడా ఆపేస్తారు. 
 
కానీ, ఇక్క‌డ ఇలాంటి రియల్ హీరోస్ ఉండడం వలనే మన దేశ రాజకీయ వ్యవస్థపై ఇంకా విశ్వాసం కొనసాగుతుంది. ఇలా ఉంటేనే దేశభక్తి అనడం లేదు, కానీ నేతలు మేము ప్రజాసేవకులు అని గుర్తిస్తే బాగుంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. అందరికీ ఆదర్శం ఈ నేత వ్యక్తిత్వం, పార్టీలు చూడవద్దు... మనషి వ్యక్తిత్వం చూడండి...అంటూ నెట్ జ‌న్లు జేజేలు ప‌డుతున్నారు.