శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (21:02 IST)

రాష్ట్రంలోనే కడపలో ఆ గ్రామంలోని ప్రజలు బాగా డబ్బున్నవారు...

‘జనంలో చైతన్యం, సమాజాభివృద్ధికి సమాయత్తం చేయడమే జన్మభూమి-మా వూరు లక్ష్యంగా’ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాయలసీమ రతనాల సీమగా మారే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాష్ట్

‘జనంలో చైతన్యం, సమాజాభివృద్ధికి సమాయత్తం చేయడమే జన్మభూమి-మా వూరు  లక్ష్యంగా’ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాయలసీమ రతనాల సీమగా మారే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం రూ.1,22,000 ఉంటే, కడప జిల్లా లింగాల మండలంలో తలసరి ఆదాయం రూ.3,90,000 ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 
 
పండ్ల తోటల అభివృద్ధితో లింగాల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కన్నా లింగాల తలసరి ఆదాయం 3 రెట్లు అధికంగా ఉండటం ఇతర మండలాలకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. కడప జిల్లాలోని రిజర్వాయర్లలో 40 టిఎంసిల నీటి నిల్వ ఉన్న విషయం గుర్తు చేశారు. 
 
చిత్తూరు జిల్లా ఉద్యానపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అనంతపురం జిల్లా పారిశ్రామిక హబ్‌గా రూపొందుతోందన్నారు. రాయలసీమ రతనాల సీమగా మారే రోజు దగ్గరలోనే ఉందంటూ నాలుగు సీమ జిల్లాలలో జరిగిన అభివృద్ధిని సోదాహరణంగా వివరించారు.
 
ప్రతి రైతు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు సంపాదించే స్థితి రావాలి
రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు వ్యవసాయికంగా అభివృద్ది చెందితే రాష్ట్రంలో వెనుకబాటు అనేదే ఉండదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో లక్ష ఎకరాలలో సాగు విస్తీర్ణం అదనంగా పెరగడం శుభసూచకం అన్నారు. 2.5లక్షల ఎకరాలనుంచి 3.5లక్షల ఎకరాలకు పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, విజయనగరం జిల్లాలో కూడా వ్యవసాయం మరింత మెరుగు పడాలన్నారు. ప్రతి రైతు ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షలు సంపాదించే స్థితి రావాలన్నదే తన ఆకాంక్షగా ముఖ్యమంత్రి చంద్రబాబు. ‘‘ సంపద సృష్టించాలి, సమ్మిళిత వృద్దికి వినియోగించాలి,పేదల సంక్షేమానికి వ్యయం చేయాలని’’ దిశానిర్దేశం చేశారు.
 
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు కలిపి ‘మహా సంగమం’: 
‘‘పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణకు తెచ్చి ‘పవిత్ర సంగమం’ చేశాం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు కలిపి ‘మహా సంగమం’ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.మూడేళ్లలో 30ప్రాజెక్టులు పూర్తిచేయడం ఒక చరిత్ర అంటూ మిగిలిన ప్రాజెక్టులను కూడా ఇదే స్ఫూర్తితో వేగంగా పూర్తిచేస్తామన్నారు. 
 
వాస్తవాలు చర్చించేందుకు అనువైన వేదికలు జన్మభూమి గ్రామసభలు: 
వాస్తవాలను చర్చించేందుకు జన్మభూమి గ్రామసభలను మించిన వేదిక లేదని ముఖ్యమంత్రి అన్నారు. అర్జీలలో అనర్హమైనవి ఉంటే గ్రామసభల్లోనే ఎందుకు తిరస్కరిస్తున్నారో వివరించాలన్నారు. దీనివల్ల వారిలో ఎటువంటి అసంతృప్తి భవిష్యత్తులో ఉత్పన్నం కాదన్నారు. ఇప్పటివరకు 8,23,715 ఫిర్యాదులు వచ్చాయని,వాటిలో 1,20,635 పరిష్కరించినట్లుగా అధికారులు తెలిపారు. 5,62,890అప్ లోడ్ చేశారని తెలియజేయగా,మిగిలినవి కూడా వేగంగా అప్ లోడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
‘‘ప్రతి గ్రామానికి,వార్డుకు డెవలప్ మెంట్ విజన్ డాక్యుమెంట్ రూపొందించాలి. ఏం చేస్తే గ్రామం,వార్డు అభివృద్ధి చెందుతాయో గుర్తించాలి,అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.అందుకు 16వేల విద్యార్ధి బృందాల సేవలు వినియోగించుకోవాలి. రాబోయే వేసవికి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. మంచినీటి సౌకర్యం ప్రతి గ్రామంలో,వార్డులో అభివృద్ధి చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
 
ప్రతి తల్లికి, బిడ్డకు భవిష్యత్ పైన భరోసా కల్పించడమే జన్మభూమి సామూహిక సీమంతాల లక్ష్యంగా పేర్కొన్నారు. మహిళల్లో, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు అన్న అమృత హస్తం, గిరి గోరుముద్దలు తదితర పథకాలను తెచ్చామన్నారు. పుట్టుకనుంచి చనిపోయేదాకా ప్రతి దశలోనూ సంక్షేమ పథకాలు అమలుచేయడం ద్వారా జీవన భద్రత ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. చంద్రన్న బీమా ప్రతిష్టాత్మక కార్యక్రమం అంటూ కేవలం రూ.15 ప్రీమియంతో రూ.5లక్షలు ఇన్సూరెన్స్ వస్తున్న పథకం ఇదనేది ప్రజలకు వివరించాలని కోరారు.