శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 2 జనవరి 2018 (14:14 IST)

వచ్చే ఎన్నికల తర్వాత అతడే ఎపి సిఎం అంటున్న మాజీ ఎంపీ...

ఏపిలో ముందస్తు ఎన్నికలు వస్తాయట. అందుకే ఇప్పటి నుంచే అధికారం కోసం అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, వైఎస్ఆర్ కాంగ్ర

ఏపిలో ముందస్తు ఎన్నికలు వస్తాయట. అందుకే ఇప్పటి నుంచే అధికారం కోసం అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర పేరుతో ప్రజలకు చేరువవుతోంది. మరోవైపు జనసేన పార్టీ కూడా ప్రజలకు దగ్గరవుతోంది. 
 
పవన్ కళ్యాణ్‌ కూడా పార్టీలో సభ్యత్వాన్ని ప్రారంభించి ఒక్కొక్కరుగా మచ్చలేని నేతలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ కేంద్రమంత్రి, తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చింతామోహన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌లు గెలవడం సాధ్యం కాదని, డబ్బుపై వ్యామోహం లేకుండా, అధికారం కోసం పాకులాడకుండా ఉండే వ్యక్తులకే పట్టం కడతారని చెప్పారు. 
 
అది ఏ సామాజికవర్గమైనా సరే.. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఒకే ఒక్క గొప్ప వ్యక్తి ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు. అయితే అతడు ఎవరో పేరు చెప్పని చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తమిళనాడులో సుబ్రహణ్యస్వామిలా ఎపిలో చింతామోహన్ తయారయ్యారని  చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.