శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (14:19 IST)

ఆమె నా బిడ్డ లాంటిది.. ఫిజీషియన్ రాకుంటే భుజానికి మందు రాసింది : గ‌జ‌ల్ శ్రీనివాస్

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ 'గజల్' కళాకారుడు గజల్ శ్రీనివాస్ స్పందించారు. ఆమె తనకు బిడ్డలాంటిదని, ఆమెతో మసాజ్ చేయించుకోలేదని వివరణ ఇచ్చాడు.

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ 'గజల్' కళాకారుడు గజల్ శ్రీనివాస్ స్పందించారు. ఆమె తనకు బిడ్డ లాంటిదని, ఆమెతో మసాజ్ చేయించుకోలేదని వివరణ ఇచ్చాడు. 'ఆలయవాణి' అనే వెబ్ రేడియోలో జాకీగా పని చేస్తున్న కుమారి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో గజల్ శ్రీనివాస్‌ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ వార్త సంచలనమైంది. ఈ నేపథ్యంలో త‌న‌పై వచ్చిన ఆరోప‌ణ‌లపై ఆయన స్పందించారు. త‌న‌పై ఆమె ఎందుకు ఆరోప‌ణ‌లు చేసిందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఆమెతో తాను మసాజ్ చేయించుకోలేదని, ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తన భుజానికి దెబ్బ తగిలిందని, ఒక రోజు ఫిజీషియన్‌ రాకపోయేసరికి ఆ యువతి మసాజ్‌ చేస్తానని చెప్పిందన్నారు. 
 
తాను వద్దంటున్నప్పటికీ ఆమే తన భుజానికి మందు రాసిందని తెలిపారు. అంతేగాని తాను చెడుగా మసాజ్ చేయించుకోలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన ఆ యువ‌తిని తాను ఓ బిడ్డ‌లా చూశానని గజల్‌ శ్రీనివాస్ తెలిపారు. తామంతా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ, ఆ భావ‌న‌తోనే ప‌నిచేస్తామ‌ని, అటువంటిది ఇటువంటి ఆరోప‌ణ‌లు ఎందుకు చేస్తుందో అర్థం కావ‌డం లేద‌ని వాపోయారు. కాగా, ఈ ఆలయవాణి వెబ్ రేడియో కూడా గజల్ శ్రీనివాస్‌దే కావడం గమనార్హం. ఇందులో కుమారి అనే మహిళ హెడ్‌ ప్రోగ్రామర్‌గా పని చేస్తోంది.