శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (17:12 IST)

పైన కోళ్ల ఎరువు, కింద మద్యం బాటిళ్లు, పట్టేసిన పోలీసులు

కోళ్ల ఎరువు మాటున అక్రమ మద్యం రవాణా చేస్తున్న పద్ధతి చూసి అధికారులు అవాక్కయ్యారు. 
పశ్చిమ గోదావరి జిల్లా లింగాల పాలెం చెక్ పోస్ట్ వద్ద భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
 
గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పెంట రవాణా చేస్తున్నట్లుగా అధికారులు నమ్మిస్తూ కింద భాగంలో పెద్ద ఎత్తున తెలంగాణ నుండి అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న ముఠాను పట్టేసారు. విశ్వసనీయ సమాచారం మేరకు కోడిపెంటతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ట్రాక్టర్ నిండా మద్యం బాటిళ్లు కనిపించాయి.
 
పైన కోళ్లపెంట వున్నప్పటికీ లోపల మద్యం బాటిళ్లు వుండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా ట్రాక్టర్ కింది భాగంలో దాచి వుంచిన 9600 మద్యం బాటళ్లు వెలుగుచూసాయి.