శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (15:22 IST)

సత్వర న్యాయం... సకాలంలో సాయం...ఇదీ లోకేష్ క్యాప్ష‌న్!!

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఈ మ‌ధ్య చురుకుగా పాల్గొంటున్న నారా లోకేష్ త‌న క్యాప్ష‌న్ మార్చుకున్నారు. ఎవ‌రైన ఆప‌ద‌ల్లో ఉంటే, వారికి సత్వర న్యాయం... సకాలంలో సాయం చేయాల‌ని సంకల్పించుకున్నారు.

అణగారిన వర్గాలకు అండగా, ఆడపిల్లలకు రక్షణగా ఉండాల‌ని నారా లోకేష్ రాజ‌కీయ సంక‌ల్పం చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై పోరాడుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సత్వర న్యాయం చేస్తారని, స‌కాలంలో సాయం అందిస్తారని మరోసారి రుజువు చేశారు.

ఎవరైనా సాయం కోరి వస్తే, అధికారంలో కొస్తే చేస్తాలే...అంటూ అంద‌రు రాజ‌కీయ నేత‌ల్లా నంగి మాటలు చెప్పకుండా, స్పాట్ లో స్పందించి, తోచిన సాయం అందించడం నారా లోకేష్ ప్రత్యేకత. కర్నూలు పర్యటనకి వచ్చిన నారా లోకేష్ ని కలిసిన మైనారిటీ యువకుడు హమీద్ భాషా తన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చెప్పుకుని సాయం కోరాడు. తక్షణమే 25వేల రూపాయ‌లు సాయంగా అందించి మానవత్వం చాటుకున్నారు

నారా లోకేష్. హమీద్ ఉత్తరం చదివి చలించిపోయిన లోకేష్ సాయం చేయడమే కాకుండా, అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గ‌తంలో లోకేష్ కి, ఇప్ప‌టి లోకేష్ కి చాలా తేడా క‌నిస్తోంద‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులే చెప్పుకొస్తున్నారు.