సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (14:26 IST)

ప్రేయసి దూరమైందని విషం తాగిన తమ్ముడు... మిగిలినదాన్ని సేవించిన అన్న

ప్రేయసి దూరమైందని తమ్ముడు మద్యంలో విషం కలుపుకుని మద్యం సేవించాడు. ఈ విషయం తెలుసుకున్న అన్న.. మిగిలిన విషాన్ని సేవించాడు. మణినగర్ పుదూర్‌కు చెందిన రాజా, విజయ్ అనే సోదరులు ఉన్నారు. వీరిలో రాజాకు 5 నెలల క్రితం వివాహమైంది. అతని తమ్ముడు విజయ్‌కి చెన్నైలో పనిచేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడగా, అది చివరకు ప్రేమకు దారితీసింది. 
 
ఈ క్రమంలో విజయ్‌ను ఆ యువతి దూరంగా పెట్టసాగింది. దీన్ని జీర్ణించుకోలేక పోయిన విజయ్... మద్యంలో విషం కలుపుకుని సేవించాడు. ఆపై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన రాజా, మద్యంలో విషం కలిపున్న సంగతి తెలియక, దాన్ని తాగేసి, ఆపై నోట్లో నుంచి నురగలు కక్కుతూ కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు వారిద్దరినీ ఆసుప్రతికి తరలించేలోగానే, ఇరువురూ ప్రాణాలు వదిలారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.