వదినపై అత్యాచారయత్నం.. వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్తుండగా.. అడ్డుకున్నదెవరు?

Last Updated: శుక్రవారం, 9 నవంబరు 2018 (14:22 IST)
దేశంలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరుసలు లేకుండా వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా సొంత వదినపై ఓ మరిది అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన అతని తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతనిపైనా దౌర్జాన్యానికి దిగాడు. దీనిపై తండ్రే కన్నకుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలు లెక్కించక తప్పలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం రజార్‌హట్‌ పట్టణంలోని హరోకల్‌ ప్రాంతానికి చెందిన జాంతు సర్దార్‌ (40) ఇంట్లోని అన్నభార్యను లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. ఓ రోజు ఆమెను వాష్‌రూంలోకి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 
 
అంతే జాంతు సర్దార్ తండ్రి జాయ్‌దేబ్‌ సర్దార్‌ (74) అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన జాంతుసర్దార్‌ కర్రతో దాడి చేశాడు. దీన్ని గమనించిన జాయ్‌దేబ్‌ మరో కుమారుడు కత్తి తీసి బెదిరించి అన్నను నిలువరించాడు. అనంతరం కొడుకుపై జాయ్‌దేబ్‌ సర్దార్‌ స్వయంగా ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :