గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (16:01 IST)

17ఏళ్ల అబ్బాయి, 22 ఏళ్ల అమ్మాయి.. పురుగుల మందు తాగి బావిలో దూకేశారు..

17ఏళ్ల అబ్బాయి, 22 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇద్దరూ బావిలో శవమై తేలారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం వడ్ల అమృతండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన కంటే వయస్సులో పెద్ద అయిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కుదరదని, తమ పెళ్లిని పెద్దలు అంగికరించరానే భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు చేసుకుంది.
 
పదోతరగతి విద్యార్థి గూగులోత్‌ ప్రశాంత్‌ (17) ఆ గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తిచేసిన భూక్యా ప్రవీణ (22)ని ప్రేమించాడు. వీరిద్దరి మనుసులు కలవడంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి కొద్ది రోజులు తిరిగారు. ఈ క్రమంలో సోమవారం కలుసుకున్న ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుని తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
 
బుధవారం రోజున ఇద్దరూ బావిలో శవమై తేలారు. బావిలో వారిని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు,తల్లిదండ్రులకు సమాచారం. వారి శవాలను బయటకు తీసిన పోలీసులు శవ పరీక్ష నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. 
 
బావి సమీపంలో పురుగుల డబ్బా కూడా లభ్యం కావడంతో ఇద్దరూ ముందు పురుగుల మందును తాగి అనంతరం బావిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇరు కుటుంబాలను పిలిచి విచారిస్తున్నారు.