సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (13:16 IST)

కోబ్రా నుంచి కొత్త లుక్.. 20కి పైగా పాత్రల్లో నటించనున్న విక్రమ్..?

Cobra
కోబ్రా సినిమా నుంచి విక్రమ్ కొత్త లుక్ విడుదలైంది. ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్న విక్రమ్.. తాజాగా సినిమాలో విక్రమ్ లుక్‌కి సంబంధించి ఫొటోని విడుదల చేశారు. ఇందులో గజిబిజీ జుట్టుతో విక్రమ్ కనిపిస్తుండగా, అతడి మెదడులో అంకెలు, ఫార్ములాలు ఉన్నట్టు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఈ కొత్త లుక్ విక్రమ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
 
సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న కోబ్రా చిత్రంలో విక్రమ్ 20కి పైగా పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా లేకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలై ఉండేది. రష్యాలో కొంత భాగం మూవీ చిత్రీకరణ జరపించిన యూనిట్ ఇప్పుడు తమిళనాడులో షూట్ చేస్తున్నారు. 
 
ఇందులో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేయనున్నారు.