సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:29 IST)

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం-ఏపీలో బలమైన గాలులు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణించి ఆదివారం ఉదయం పశ్చిమ బంగాళాఖాతంలో వ్యాపించింది. 
 
ఈ ప్రభావంతో ఏపీకి ముప్పు తప్పదంటున్నారు వాతావరణ శాఖాధికారులు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
 
ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తాయని వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో బలమైన గాలులు వాయువ్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం కారణంగా పశ్చిమబెంగాల్ అప్రమత్తమైంది. ఈశాన్య రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి.