ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (07:14 IST)

11న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఈ నెల 6న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాటికి బలహీనపడిందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.