బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 8 జనవరి 2018 (18:52 IST)

జ‌న్మ‌భూమి- మా ఊరులో మా పంట‌లు - మా వంట‌లు

అమ‌రావ‌తి: జ‌న్మ‌భూమి - మా ఊరు కార్య‌క్ర‌మంలో భాగంగా మా పంట‌లు - మా వంట‌లు పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప‌ర్యాట‌క సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రాన్ని ఆనంద‌, ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చాల‌న

అమ‌రావ‌తి: జ‌న్మ‌భూమి - మా ఊరు కార్య‌క్ర‌మంలో భాగంగా మా పంట‌లు - మా వంట‌లు పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప‌ర్యాట‌క సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రాన్ని ఆనంద‌, ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చాల‌న్న ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయిడి ఆలోచ‌న‌ల మేర‌కు మ‌హిళ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసామ‌న్నారు. 
 
జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం చివ‌రి రోజైన ప‌ద‌కొండ‌వ తేదీన మండ‌ల స్థాయిలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ వంట‌ల పోటీల‌ను నిర్వ‌హిస్తుంద‌ని, ఆయా మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారులు కార్య‌క్ర‌మానికి నేతృత్వం వ‌హిస్తార‌ని మీనా వివ‌రించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ ఆరోగ్య‌క‌రమైన వంట‌ల‌కు సంబంధించిన మెటీరియ‌ల్‌ను స‌మ‌కూర్చుతుంద‌ని గోడ పత్రిక‌లు, ఛాయా చిత్రాలు అందుబాటులో ఉంటాయ‌ని, వాటిని జ‌న్మ‌భూమి - మాఊరు కార్య‌క్ర‌మంలో ప్ర‌ద‌ర్శ‌నగా ఉంచాల‌ని స్ప‌ష్టం చేసారు.
 
మా పంట‌లు - మా వంట‌లు కార్య‌క్ర‌మాన్ని మండ‌ల కేంద్రాల‌లో నిర్వహిస్తార‌ని ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు. మూడు విభాగాలుగా పోటీలు జ‌రుగుతాయ‌ని, అల్పాహారం, మ‌ధ్యాహ్న భోజ‌నం, తీపి వంట‌కాల విభాగాల‌లో ఉత్సాహ‌వంతులు పోటీ ప‌డ‌వ‌చ్చ‌న్నారు. పోటీల‌కు వినియోగించే వంట సామాగ్రిని పాల్గొనే వారే స‌మ‌కూర్చుకోవ‌ల‌సి ఉంటుంద‌ని,  ప్ర‌ద‌ర్శ‌న‌కు అవ‌స‌మైన ఏర్పాట్ల‌ను ఎంపిడిఓ చేప‌డ‌తార‌ని వివ‌రించారు. స్ధానిక వంట‌ల‌కు త‌గిన ప్రాచుర్యం క‌ల్పించ‌టం కార్య‌క్ర‌మ ముఖ్య ఉద్దేశ్య‌మ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి తెలిపారు. 
 
ఈ పోటీల ద్వారా ఆరోగ్య క‌ర‌మైన వంట‌ల త‌యారీపై అవ‌గాహాన పెంపొందుతుంద‌ని, మ‌హిళ‌లు త‌మ నైపుణ్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌గ‌లుగు తార‌న్నారు. ఎంపిడిఓ నేతృత్వంలోని ముగ్గురు స‌భ్యుల బృందం ఈ పోటీల‌కు న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, వీరిలో స్ధానిక ప్ర‌జాప్ర‌తినిధితో పాటు, ఐసిడిఎస్ లేదా డిఆర్‌డిఎ అధికారి స‌భ్యులుగా ఉంటార‌ని మీనా పేర్కొన్నారు. ప్ర‌తి విభాగంలో ప్ర‌ధ‌మ‌, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తులు ఉంటాయ‌న్నారు. మండ‌ల స్ధాయి విజేత‌ల‌కు  ఆంధ్ర ప్‌‌దేశ్ టూరిజం అధారిటీ రాష్ట్ర స్ధాయిలో నిర్వ‌హించే ఉత్త‌మ ఇంటి ఛెప్ పోటీల‌కు ఆహ్వానం అందిస్తుంద‌న్నారు. వీరికి ఉగాది లోపు పోటీలు నిర్వ‌హించి స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా బ‌హుమ‌తులు అంద‌చేస్తామ‌ని ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు.